Thursday, April 25, 2024

ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బుట్ట బొమ్మ..

అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బుట్టా బొమ్మ. ఈ నెల (ఫిబ్రవరి) 4న థియేటర్లలో రిలీజ్ అయింది. శౌరి చంద్రశేఖర్ ఈ మూవీతో డైరెక్టర్ గా అరంగేట్రం చేశారు. ఈ రొమాంటిక్ త్రిల్లర్ మలయాళంలో హిట్ అయిన కప్పెల మూవీ అధికారిక రీమేక్ ఈ సినిమా. అయితే ఈ మూవీ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకపోయింది.

కాగా, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. విడుదలైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ సినిమా OTTలో వస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సోంతం చేసుకుంది. కాగా, వచ్చే నెల (మార్చి) 4వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుంది ఈ మూవీ. OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌ తన అధికారిక వెబ్సైట్ లో ఈ విశయాన్ని వెల్లడించింది.

- Advertisement -

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో రూపొందిన ఈ మూవీకి గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. నవ్య స్వామి, జగదీష్ ప్రతాప్ బండారి, రాజ్ తిరందాసు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయిన వారు మార్చి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement