Thursday, May 16, 2024

Bubble Gum ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ !

రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ బబుల్ గమ్. ఈ మూవీని యువ దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించగా మానస చౌదరి హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయింది. కాగా ఈ మూవీని ఫిబ్రవరి 9న ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా వారు ప్రసారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం బబుల్ గమ్ ఓటిటి రిలీజ్ పై అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇంకా ఈ మూవీలో హర్ష చెముడు, కిరణ్ జి, అనన్య ఆకుల, అను హాసన్, బిందు చంద్రమౌళి తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement