Thursday, May 2, 2024

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ? – లేటెస్ట్ అప్డేట్

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఇక అలాగే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు మొదట అనౌన్స్ చేసినప్పటికీ…ఆ తర్వాత కొరటాల శివకు షిఫ్ట్ అయ్యాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఆ పేరును ప్రకటించలేదు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement