Sunday, April 28, 2024

Divi : బిగ్ స్క్రీన్ పై బిగ్ బాస్ బ్యూటీ జోరు…

బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్య… తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేముందు మహేష్ బాబు మహర్షి తోపాటు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీల్లో మెరిసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, జగపతి బాబు రుద్రంగిలో యాక్ట్ చేసింది.

క్యాబ్ స్టోరీస్, నయూమ్ డైరీస్ చిత్రాల్లనూ నటించింది. సినిమాలతో పాటు మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్ ల్లో కూడా నటించి ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ కానున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీలో జర్నలిస్ట్ గా కనిపించనుంది.

- Advertisement -

తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం వంటి మంచి హిట్‌లను అందించిన కళ్యాణ్ కృష్ణ.. ఈ మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం కానున్నారు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. షూటింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ విడుదల ..మార్చి 15వ తేదీన లంబసింగి చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement