Saturday, April 27, 2024

సునీల్ ప్రధాన పాత్రలో భువ‌న విజ‌య‌మ్.. గ్లింప్స్ వీడియో

నటుడు సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భువ‌న విజ‌య‌మ్. ఈ చిత్రం నుండి గ్లింప్స్ ని వీడియోని రిలీజ్ చేశారు. కామెడీ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇందులో ఫీలింగ్‌ స్టార్ ప్రీతమ్‌ కుమార్‌ పాత్రలో సునీల్ కనిపించనున్నట్టు తెలియజేశారు. భువన విజయమ్‌లో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్‌, జబర్ధస్త్‌ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్‌ రాజ్‌, వెన్నెల కిశోర్, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్‌ బ్యానర్‌పై కిరణ్‌, వీఎస్‌కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.యలమంద చరణ్‌ డైరెక్షన్‌లో స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ థీమ్‌తో వస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ వన్ ఆఫ్‌ ది కీ రోల్‌ పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్ రామస్వామిగా నటిస్తుండగా.. అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ఈ వీడియో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తోనే సాగుతుంది. ఈ సినిమాలో రామస్వామి పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగనున్నట్టు అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement