Sunday, May 5, 2024

Bhomika : అ ఖుషీ మెరుపులు ఇప్ప‌టికీ త‌గ్గ‌లా…

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా భూమిక అలరించింది. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి.

అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఈ ఫోజుల్లో ఫ్యాన్స్ అంతా ఖుషి చిత్రంలోని భూమిక లుక్స్ ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెలియా చెలియా చిరు కోపమా అంటూ ఆ చిత్రంలోని సాంగ్ ని కామెంట్స్ గా పెడుతున్నారు. మరోసారి భూమిక ఖుషీలో పవన్ కళ్యాణ్ చెలియాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement