Sunday, April 28, 2024

Andhra Pradesh – చెల్లింపులు లేక కాంట్రాక్టర్ల కుటుంబాలు ఛిద్రం

..విజయవాడ, నవంబర్‌ 22: కాంట్రాక్టర్ల దీర్ఘకాలిక బకాయిలు, అసంబద్ధ చెల్లింపులు, అపరిష్కృత సమస్యలపై బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌) మద్దతు ప్రకటించింది. ఆ సంఘం ఏపీ శాఖ అయిన స్టేట్‌ ఆఫ్‌ ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు బెజవాడలో జరుగుతున్న ఆందోళనకు సంఫీుభావం ప్రకటించారు. బాయ్‌, సాబ్‌స్కా సంఘాల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు హాజరై ధర్నాచౌక్‌లో తమ గళం వినిపించారు.

ఈ సందర్బంగా సంఘం నాయకులు చెరువు రామకోటయ్య మాట్లాడుతూ వివిధ ప్రభుత్వశాఖ ల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సకాలంలో బకాయిలు చెల్లించలేకపోవడం వలన వడ్డీల భారం తో తీవ్రంగా సతమవుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల ఆవేదన ను ప్రభుత్వం అర్ధం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు . రాఘవరావు ప్రసంగిస్తూ బిల్లులు చెల్లించక పోవడం వలన పనులు నిర్వహణ లో స్థబ్దత ఏర్పడి దీనిపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

. కే. శేఖర్ బాబు మాట్లాడుతూ అనేక పనుల నిమిత్తం వడ్డీలకు సొమ్ములు తెస్తున్నామని, బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సోదర కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల్లో పెండింగ్ పడిపోయాయని, తక్షణమే బిల్లులు చెల్లించాలని బాయ్‌, సబ్‌స్కా సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమం లో సంఘాల ప్రతినిధులు ఎన్. నాగేశ్వరరావు, శ్రీనివాస రెడ్డి, పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement