Sunday, April 28, 2024

విగ్గు లేకుండా మొదటి సారి బాలయ్య సినిమా ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బిబి 3.ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఇక మొదట ఈ సినిమాలో బాలయ్య అఘోర గా కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆ పాత్రను తీసేసి వేరే పాత్రని బోయపాటి సృష్టించాడట.

అంతే కాదు విశేషం ఏంటంటే ఆ పాత్రలో బాల‌య్య విగ్గు లేకుండా కనిపించబోతున్నాడట‌. ఇక బాలయ్యను విగ్గు లేకుండా సినిమాల్లో చూడటం మొదటి సారి ఇదే.ఇక చాలా సినిమాలలో విగ్గులతో అభిమానులను నిరాశ పరిచిన బాలయ్యను ఇప్పుడు విగ్గు లేకుండా బోయ‌పాటి ఎలా చూపిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement