Saturday, April 27, 2024

బాలయ్య 108వ సినిమా.. విల‌న్ గా అర్జున్ రాంపాల్..!

హీరో బాలయ్య 108వ సినిమా తెర‌కెక్కుతోంది.ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.. సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మింస్తున్నారు. బాలయ్య సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో కాజల్ సందడి చేయనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నటించనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రకి అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యారు. తాజాగా ఆయనకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే అది విలన్ పాత్రేనా .. లేదా అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement