Monday, May 6, 2024

‘అఖండ’ లో ఎమోషన్ ఎక్కువేనట !!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పటికే అఖండ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్ కన్నా ముందు ఫస్ట్ రోర్ వీడియోతో దుమ్ముదులిపాడు బాలయ్య.

అయితే ఈ సినిమాలో ఎప్పటిలాగానే బాలయ్యను పవర్ ఫుల్ గా బోయపాటి చూపించబోతున్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఎమోషనల్, వెరీ ఎమోషనల్ లో కూడా కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement