Monday, April 29, 2024

‘బలగం’ సినిమా మరో రికార్డు.. ధియేటర్లో రిలీజ్ అయ్యి 50 రోజులు

థియేటర్లకు రావడానికి జనాలు పెద్దగా ఆసక్తి చూపని స‌మ‌యంలో.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యి ప్రేక్ష‌కుల‌నుంచి సూప‌ర్ రెస్పాన్స్ సోంతం చేసుకున్న సినిమా బలగం. వేణు యెల్దండి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎమోష‌నల్ విలేజ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కమర్షియల్‌గా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకుని అరుదైన ఫీట్‌ను సాధించింది.

ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు కూడా ఇది సాధ్యం కాని విషయం, రిలీజ్ అయిన నాలుగు వారాల‌కే ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌టంతో థియేట్రిక‌ల్ ర‌న్ ఎక్కువ‌రోజులు ఉండ‌టం లేదు. దీంతో, చిన్న సినిమాగా వ‌చ్చి థియేట‌ర్ల‌లో 50రోజులు పూర్తి చేసుకోవ‌డంతో ఖచ్చితంగా ఇది బలగం మూవీ టీమ్ కి అద్భుతమైన విజయం అనే అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఈ సినిమా OTTలో రిలీజ్ అయిన తరువాత కూడా థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది.

బలగం సినిమాకి హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి నిర్మాన బాద్య‌త‌లు వ‌హించారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement