Monday, May 6, 2024

మే 15న బేబి మూవీ మూడోసాంగ్..

బేబి చిత్రం నుండి మూడో పాట‌కి సంబంధించిన అప్ డేట్ ని అందించారు మేక‌ర్స్.బేబి నుంచి ప్రేమిస్తున్నా అంటూ సాగే మూడో సాంగ్‌ను మే 15 సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బేబి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్నిమాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాయిరాజేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నారు. వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఓ రెండు మేఘాలిలా సాంగ్‌ యూట్యూబ్‌లో 20 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించగా.. రెండో సాంగ్ దేవరాజా 5 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి మ్యూజిక్‌ లవర్స్‌ ను ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement