Friday, May 3, 2024

ఆక‌ట్టుకుంటోన్న.. అయ‌లాన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

అయ‌లాన్ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అయ‌లాన్.ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌, ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా శివ‌కార్తికేయ‌న్..హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ న‌టించారు.కాగా ఈ పోస్ట‌ర్ లో శివకార్తికేయన్‌ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్‌ కూడా వెళ్లడం పోస్టర్‌లో కనిపిస్తోంది.మొత్తానికి ఈ సారి మాత్రం సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగే సినిమాను అభిమానులకు అందించేందుకు శివ‌కార్తికేయ‌న్ రెడీ అవుతున్నాడని తాజా లుక్‌తో అర్థమవుతోంది. అంతేకాదు దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజా లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement