Sunday, April 28, 2024

బర్త్ డే బ్యూటీ…కొత్త సినిమా ఫస్ట్ లుక్

కెరీర్ ఆరంభంలో వరుస సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ లను అందుకుంది అవికా గోర్. తన అందంతో అభినయంతో లక్షలాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందింది ఈ అమ్మడు. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది అవికా. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా ఓకే చేసేస్తోంది.

ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య తో పాటు కళ్యాణ్ దేవ్ కి కూడా ఓకే చెప్పింది. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. కాగా నేడు అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా…టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

సభకు నమస్కారం…అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement