Thursday, April 18, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది

వాట్సాప్‌లో ఓ కొత్త ఫీచ‌ర్ రాబోతోంద‌ని ఇటీవల ఫేస్‌బుక్‌, వాట్సాప్ ప్రతినిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వ్యూ వ‌న్స్’ అనే ఆ కొత్త ఫీచ‌ర్ వ‌చ్చేసింది. అయితే ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్ బీటా వెర్ష‌న్‌లో మాత్ర‌మే ఇది అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫీచ‌ర్ ఉప‌యోగించి ఒక యూజ‌ర్ అవ‌త‌లి వ్య‌క్తికి పంపించే వీడియో లేదా ఫొటోను కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే చూసే వీలుంటుంది. ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్ష‌న్ కోసం వాట్సాప్ బీటాలో ఈ ఫీచ‌ర్‌ను ప్రారంభించిన‌ట్లు వాబీటాఇన్ఫో వెల్ల‌డించింది.

ఈ వెర్ష‌న్‌లోని బీటా యూజ‌ర్లు ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌కు సంబంధించి కొన్ని స్క్రీన్‌షాట్ల‌ను కూడా రిలీజ్ చేసింది. దీనిని బ‌ట్టి ఈ ఫీచ‌ర్‌ను ఎలా వాడాలో తెలుసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ఉప‌యోగించి మీరు పంపించే ఫొటో లేదా వీడియోను అవ‌త‌లి వ్యక్తి కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే చూడ‌గ‌ల‌రు. దీనిని పంపిన యూజ‌ర్ కూడా అది డెలివ‌ర్ అయిందా, ఓపెన్ చేశారా అన్న స్టేట‌స్ చూడవచ్చు.

ఇది కూడా చదవండి: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement