Sunday, April 28, 2024

సభకు నమస్కారం…అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్

అల్లరి నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా తానేంటో నిరూపించుకున్న అల్లరినరేష్ అతి తక్కువ సమయంలోనే 50 సినిమాలకు పైగా సినిమాలను చేశారు. ఇటీవల నాంది సినిమా తో ఎమోషనల్ గా కూడా తాను మెప్పించగలనని నిరూపించుకున్నాడు. కాగా ఈ రోజు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక ఫస్ట్ లుక్ టైటిల్ విషయానికొస్తే ఈ సినిమాకు సభకు నమస్కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే పోస్టర్ లో అల్లరి నరేష్ సభని.. ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వెనక జేబులో డబ్బు, మద్యం పెట్టుకుని కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే ఈ సారి కూడా అల్లరి నరేష్ డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement