Sunday, May 5, 2024

పుష్ప టీజర్ మరో రికార్డ్!!

ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ ను సుకుమార్ ఈ టీజర్ లో అద్భుతంగా చూపించారు.

ఇప్పటికే యూట్యూబ్ లో దుమ్ము దులుపుతున్న టీజర్ ఇటీవలే 70 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ ను క్రియేట్ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అదే స్పీడ్ తో 75 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement