Wednesday, May 15, 2024

మల్టీ స్టారర్ అమ్మ మొగుడు!! విజయ్ దళపతి ఎన్టీఆర్ తో అట్లీ సినిమా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో సౌత్ లో లో మల్టీస్టారర్ మూవీ ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు అట్లీ మరో బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో ఓ సినిమా చేయబోతున్నాడట.

ఇప్పటికే ఈ మేర అటు కోలీవుడ్ లో టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త విన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,విజయ్ దళపతి ఫాన్స్ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ముందు తెలియట్లేదు. ప్రస్తుతానికి అటు విజయ్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా వారి వారి సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం ఎవరో ఒకరు అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement