Thursday, May 2, 2024

విజయ్ దళపతికి రామ్ చరణ్ విలన్?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కి తెలుగులో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమాతో ఘన విజయం సాధించిన విజయ్ ఘన విజయం సాధించటంతో పాటు అదే స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టారు. ఇక ఈ సినిమాలో విజయ్ కు విలన్ గా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన హైలెట్ గా నిలిచింది.

అయితే ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు కోలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు అరవిందస్వామి పేరు తెరమీదకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా నటించేది ఆయనే అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement