Saturday, May 4, 2024

‘అర్జున ఫ‌ల్గుణ’ నుండి రొమాంటిక్ పోస్ట‌ర్

త‌న‌దైన‌శైలిలో త‌న‌కి సూట‌య్యే చిత్రాల‌ను ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు హీరో శ్రీవిష్ణు. కాగా ఆయ‌న తాజా చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. తేజ‌మార్ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌. ప్రియదర్శన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా అమృత అయ్యర్ న‌టిస్తుంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో నరేశ్ .. శివాజీ రాజా .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. నాయకానాయికలకు సంబంధించిన ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement