Saturday, April 27, 2024

Anupama parameswaran: శృంగార‌ స‌న్నివేశాల‌లో న‌టించ‌డ‌మే పెద్ద క‌ష్టం…

బ్లాక్ బ‌స్ట‌ర్ ‘డిజె టిల్లు’కు సీక్వెల్ గా రూపొందిన టిల్లూ స్క్వేర్ విడుదలకు రెడీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లుగా తన పాత్రను తిరిగి పోషించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ అత‌డితో రొమాన్స్ చేస్తోంది సిద్ధూతో ఆమె చేసిన శృంగార సన్నివేశాలు చాలా మందిని ఆకర్షించాయి.

చివరగా అనుపమ ఈ సీన్స్ గురించి తన మౌనాన్ని వీడింది. అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిల్లూ స్క్వేర్‌లో సిద్ధు జొన్నలగడ్డతో నటించిన ఘాటైన‌ సన్నివేశాల గురించి హోస్ట్ ప్రశ్నించారు. ఇందులో రొమాన్స్ సీన్స్ గురించి ప్ర‌శ్నించారు. అయితే కెమెరాల ముందు అంత‌మంది స‌మ‌క్షంలో రొమాన్స్ సీన్ల‌లో న‌టించ‌డం అంత సులువు కాద‌ని అనుప‌మ అంది.

- Advertisement -

వంద‌మంది ముందు న‌టించ‌డం చాలా క‌ష్టం. ఆ స‌మ‌యంలో పాత్ర‌లో లీన‌మ‌వుతూ, ఆడియెన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదని అంది. రొమాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు క‌దా? అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement