Friday, April 26, 2024

అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ రిలీజ్ మరో అప్డేట్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పన్ కొషియమ్ రీమేక్ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా తదుపరి షెడ్యూల్ ను వాయిదా వేసుకుంది.

వచ్చే నెల నుంచి మిగిలిన షూటింగ్ ను కూడా కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement