Friday, April 26, 2024

పుష్ప పార్ట్ 2 కి మరో టైటిల్ !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాను రెండు పార్టులుగా తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి భాగానికి పుష్ప అనే టైటిల్ ను రెండవ భాగానికి వేరొక సన్నాహాలు చేస్తుందట.

త్వరలోనే ఆ కొత్త టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారట. ఇక ఈ ఏడాది ఆఖరికి పుష్ప రిలీజ్ చేయాలని అలాగే రెండో పార్ట్ ను వెంటనే మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మలయాళం స్టార్ నటుడు ఫహాద్ పాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement