Friday, May 3, 2024

SR క‌ళ్యాణమండపం నుంచి మరో సాంగ్….సిగ్గేందుకు రా మావ!!

కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ దుర్గాదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SR క‌ళ్యాణమండపం EST 1975. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లారా వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ వ్యూస్ దక్కించుకున్నాయి. అలాగే టీజ‌ర్ సైతం అందరిని ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమాను థియేట‌ర్స్ లో మాత్రమే విడుద‌ల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

కాగా తాజాగా సిగ్గేందుకు రా మావ అంటూ సాగే మరో పాట‌ను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ సింగర్ అనురాగ్ కుల‌కుర్ణి ఈ పాటను అద్భుతంగా ఆలపించగా చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement