Wednesday, May 15, 2024

మరో ఆఫర్ పట్టేసింది @బిగ్ బాస్ దివి

బిగ్ బాస్ దివి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దివి హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల క్యాబ్ స్టోరీస్ సిరీస్ లో కనిపించిన దివి ఇప్పుడు మరో తెలుగు వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారట.

ఈ వెబ్ సిరీస్ ను స్వయంగా ఆయనే నిర్మిస్తున్నారు. అతని సహచరుడు నవీన్ గాంధీ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా దివిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా లుసిఫర్ రీమేక్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా దివి ఓ కీలక పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement