Tuesday, April 30, 2024

హిందీలో రీమేక్ కానున్న మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ.. వెల్ల‌డించిన మేకర్స్

భాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర ఇప్పటికే అక్షయ్ కుమార్ హీరోగా.. తమిళ మూవీ సూరరై పొట్రు హిందీ రీమేక్‌ను రూపొందిస్తున్నారు. కాగా, ఇప్పుడు మరో తమిళ బ్లాక్ బస్టర్ బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ప్రదీప్ రంగనాథన్, ఇవానా ప్రధాన జంటగా నటించిన లవ్ టుడే, తమిళం అండ్ తెలుగు భాష‌ల్లో రిలీజ్ అయింది. 2022 బ్లాక్ బస్టర్స్‌లో సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

తాజా సమాచారం ప్ర‌కారం, లవ్ టుడే నిర్మాత అర్చన కల్పాతి ఈ మూవీని ఫాంటమ్ స్టూడియోస్, సృష్టి బెహ్ల్ ఆర్యతో కలిసి హిందీలో రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, లాంచ్ వివరాలను త్వరలో వెల్లడించ‌నున్న‌ట్టు తెలిపారు. లవ్ టుడేలో సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధిక శరత్‌కుమార్, రవీనా తదితరులు ముఖ్యమైన పాత్రల్లో న‌టించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement