Thursday, April 25, 2024

బ్యాంకు రుణాలను పొదుపు సంఘాలు సద్వినియోగం చేసుకోండి : డిఆర్డిఏ ఏపీడి రాజు

బుచ్చిరెడ్డిపాలెం, ప్రభ న్యూస్ : బ్యాంకు ద్వారా రుణాలు పొందిన పొదుపు సంఘాలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డిఏ ఏపీడి రాజు సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని పంచేడు గ్రామంలో ఏపిఎం లలితారెడ్డి తో కలిసి పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు అందించిన రుణాలను పొదుపు సంఘాలు వ్యక్తిగత అవసరాలకు కాకుండా వ్యాపారానికి వినియోగించుకోవాలని సూచించారు.

క్రెడిట్ ఫ్లో సంబంధించి రుణాలను ఆదాయ వనరులకు సంఘాలు వినియోగిస్తున్నారు లేదా ఆరా తీశామన్నారు. పొదుపు సంఘాలు మహిళలు వారి జీవనోపాధిని పెంచుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అధిక వడ్డీలకు ప్రైవేటు లోన్లు తెచ్చుకొని ఇబ్బంది పడవద్దు అని సూచించారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు చేసి ఆదాయం ఘటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం చంద్ర సిసి ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement