Saturday, May 4, 2024

చెర్రీ, ఎన్టీఆర్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ?

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి సినీ అభిమానులకు సంగీత ప్రియులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే సత్తా ఉన్న అనిరుద్ ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ,నాని గ్యాంగ్ లీడర్ ,జెర్సీ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ని ఇచ్చారు అనిరుద్. అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30వ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల సాంకేతిక నిపుణులను వెతికే పనిలో ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేరును పరిశీలించారట. అలాగే అనిరుద్ నే ఓకే చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా అనిరుద్ ను తీసుకున్నారట. మరి ఇ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే అనిరుద్ ఛాన్స్ కొట్టినట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement