Sunday, April 28, 2024

ఎన్టీఆర్ అడిగితే అనిరుధ్ అంత చెప్పాడా ?

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అనిరుధ్ కి ఉన్న డిమాండ్ గురించి కూడా కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే అనిరుధ్ తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోలేక పోయాడు. అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించినా దానిని కంటిన్యూ చేయలేకపోయాడు.

అయినప్పటికీ టాలీవుడ్ హీరోలు మాత్రం అనిరుధ్ తో ఒకసారైనా పని చేయాలని కోరుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా తన కొత్త సినిమాలోని ఓ పాట కోసం అనిరుధ్ ని అడుగుతున్నారట. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలోని ఓ పాట కోసం అనిరుధ్ ని అడగగా అనిరుధ్ ఏకంగా నాలుగు కోట్లు రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట. మరి నిర్మాతలు అందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement