Wednesday, April 24, 2024

ఏపీ బీజేపీ నేతపై దాడి

గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను అడ్డుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన చేతికి, తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడి చేయించింది మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అని బాధితుడు రమేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ మహాల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపులో శివాలయం కూల్చివేశారు. దీనిపై రమేష్ న్యాయపోరాటం చేశారు. స్తరణలో భాగంగా శివాలయాన్ని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు అప్పట్లో చెప్పారు. శివాలయం తొలగింపుపై బీజేపీ, జనసేన కలిసి న్యాయపోరాటం చేశాయి. ఈ క్రమంలో వినుకొండ కమీషనర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసువాలని ఉన్నతాధికారులకు బీజేపీ నేత రమేష్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జోక్యంతో మధ్యలోనే విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిందని రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement