Sunday, April 28, 2024

Anil Ravipudi : ముహూర్తం కుదిరింది….

యాక్షన్‌ చిత్రాలకు వినోదాన్ని జోడించి తీస్తూ వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. తొలి చిత్రం పటాస్‌తోనే సంచలనం సృష్టించాడు. ఎఫ్‌ 2, సరిలేరు మీకెవ్వరు, భగవంత్‌ కేసరి చిత్రాల విజయంతో కమర్షియల్‌ స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. విక్టరీ వెంకటేష్‌తో ఎఫ్‌ 2లో కామెడీ పండించిన అనిల్‌ మరో ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కలయికలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. భగవంత్‌ కేసరి తర్వాత అనిల్‌ చేస్తున్న సినిమా ఇదే. సైంధవ్‌ తర్వాత వెంకటేష్‌ నటించే చిత్రం కూడా ఇదే అవుతుంది. ఈ కాంబినేషన్‌ చిత్రానికి ముహూర్తం కుదిరిందని తెలిసింది. ఉగాది రోజున శ్రీకారం చుడతారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అంటున్నారు. హైదరాబాద్‌లోని ఘనంగా మొదలెడతా రని సమాచారం. దీనికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. సినిమా ప్రారంభం గురించి అధికారికంగా
ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement