Friday, May 3, 2024

అల్లు అర్జున్ పై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తన అందంతో అభినయంతో బుల్లి తెర నుండి వెండితెర వరకు ఎదిగింది. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఇప్పుడు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది అనసూయ. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

కాగా అల్లు అర్జున్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అనసూయ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమాలానే చేస్తాడు. అర్జునుడు చెట్టు మీద ఉన్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్లుగా బన్నీ కళ్ళు కూడా ఎప్పుడూ చెప్పిన పాయింట్ మీదే ఉంటాయని అనసూయ అన్నారు. ఇక అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement