Thursday, April 25, 2024

అల్లు అర్జున్ మూవీకి యూట్యూబ్‌లో 350 మిలియన్ వ్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. అయితే ఈ మూవీ హిందీలో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. ‘డీజే’ హిందీ డబ్బింగ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఏకంగా 350 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో బన్నీ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో పాటలు పాపులర్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement