Friday, April 26, 2024

దాక్కో దాక్కో మేక….పుష్ప ఫస్ట్ సింగిల్ రిలీజ్

స్టైలిష్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ సాంగ్ వినగానే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక అల్లుఅర్జున్ యాటిట్యూడ్ వేరే లెవెల్ లో కనిపిస్తోంది. అలాగే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలెట్ గా ఉంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గాఅల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపిస్తుండగా… రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement