Monday, May 6, 2024

అక్షయ్ కుమార్@150..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అనతి కాలంలోనే 150 సినిమాల మైలు రాయికి చేరువయ్యాడు. అక్షయ్ కుమార్ కెరీర్ లో ఖాళీ అనేది లేకుండా ఎప్పుడూ ఏదో ఒకసినిమాతో బిజీగానే ఉంటూ వస్తున్నాడు. 1987లో కెరీర్ ప్రారంభించిన అక్షయ్ ఇప్పటికి 146 సినిమాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆగస్టు 19న ‘బెల్ బాటమ్’ రిలీజ్ అవుతోంది. ఇంకా లిస్ట్ లో ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘ఆత్రంగీ రే’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘మిషన్ సిండ్రెల్లా’ సినిమాలున్నాయి. అయితే 150 సినిమాను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. దానికోసం స్పెషల్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నట్లు టాక్. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు పూర్తి చేశాడు. ఇక నాగార్జున, వెంకటేశ్ ఆ మార్క్ కి కొద్ది దూరంలో ఉన్నారు. ఇక ఈ తరం స్టార్ హీరోలకు వంద సినిమాలు అందని ద్రాక్షగానే మిగిలేలా ఉంది.

ఇది కూడా చదవండి: దాక్కో దాక్కో మేక….పుష్ప ఫస్ట్ సింగిల్ రిలీజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement