Sunday, May 12, 2024

ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న అక్షయ్ కుమార్ ‘కట్‌పుట్ల్లి’

మ‌రో సారి అక్షయ్ కుమార్ తన ప్రదర్శనలు, సినిమాల‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇటీవలి రిలీజ్ అయిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘కట్‌పుట్ల్లి’. ఈ మూవీ క్రైమ్ & థ్రిల్ల‌ర్ ప్లాట్ లైన్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి సెకన్లలో వీక్షకులను రంజింపజేస్తుంది. కాగా, ఈ సినిమా ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో నం.1 గా ట్రెండింగ్‌లో ఉంది. దాని విశేషమైన గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అక్షయ్ కుమార్ న‌టించిన‌ ఈ సినిమా ఈ నెలలో అన్ని రికార్డులను బద్దలు కొట్టెంసింది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీకి విమర్శకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది.
150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డిజిటల్ హక్కులను స్టార్ గ్రూప్ దాదాపు 180 కోట్లకు కొనుగోలు చేసింది.

అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా తొలి వసూళ్లు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. కట్‌పుత్లీ 8 మిలియన్ వ్యూస్‌తో హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. అలాగే, కట్‌పుట్లీ వ్యూస్ పరంగా అలియా భట్ యొక్క ‘డార్లింగ్స్’ & ఝాన్వీ కపూర్ ‘గుడ్‌లక్ జెర్రీస‌ని దాటేసింది. డార్లింగ్స్ కు 6.7 మిలియన్ల OTT వ్యూస్ రాగా.. గుడ్ లక్ జెర్రీకి 4.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement