Monday, April 29, 2024

అఖిల్ 6@ కొరటాల ?

అక్కినేని అఖిల్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ల అవుతున్నా సరైన హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ తన ఆరవ చిత్రం కొరటాల శివ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున కొరటాల శివ తో ఇదే విషయమై చర్చించారట. కొరటాల కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొరటాల ఆచార్య, ఎన్టీఆర్ ల సినిమా చేసిన తర్వాత అఖిల్ సినిమానుపట్టాలెక్కిస్తాడట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement