Tuesday, April 30, 2024

యాక్షన్ తో స్టార్ట్ చేయబోతున్న అఖండ!!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ కాగా ఆఖరి షెడ్యూల్ ను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది యూనిట్.

ఈ బ్యాలెన్స్ షూట్ ను అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో బాలకృష్ణ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల జూలై నుంచి స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement