Friday, May 3, 2024

కేజీఎఫ్2 రికార్డ్ బ్రేక్ చేసిన వాలిమై!!

సౌత్ ఇండియా సినిమాల మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో తెరకెక్కుతున్న చాలావరకు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. కాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఆయన పేరిట ఓ సరికొత్త రికార్డును సృష్టించారు.కొన్ని రోజుల క్రితం అజిత్ వాలిమై సినిమాకు సంబంధించి బుక్ మై షో ఇంట్రెస్ట్స్ లో ఓ పోల్ ని ఏర్పాటు చేశారు.

అందులో ఏడు లక్షలకు పైగా అభిమానులు ఇంట్రెస్ట్స్ చూపించారు. అయితే తాజాగా ఇది కేజీ కే జిఎఫ్ 2 దాటినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అది వన్ మిలియన్ మార్క్ ను కూడా దాటడం రికార్డు గానే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. తెలుగు విషయానికొస్తే అప్పట్లో బాహుబలి2 కు వన్ మిలియన్ ఇంట్రెస్ట్స్ నమోదు అయింది.

సభకు నమస్కారం…అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement