Wednesday, May 1, 2024

దూసుకుపోతోన్న.. ఏజెంట్ ట్రైల‌ర్

సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ మూవీలో హీరోగా అఖిల్ న‌టిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సినిమా సక్సెస్ సాధించాలని తపనతో ఉన్నాడు అఖిల్. గతంలో తాను చేసిన సినిమాలన్నీ.. హీరోగా తనను నిలబెట్టక పోవడంతో.. ఈసినిమా కోసం గట్టిగా కష్టపడ్డాడు అఖిల్. ఈ సినిమా సక్సెస్ అఖిల్ కు చాలా ఇంపార్టెంట్.. అందుకే ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా.. కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్లలో భాగంగా.. ఏజంట్ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ ను రిలీజ్ చేశారు. కాకినాడలో జరిగిన ఈవెంట్ లో భాగంగా ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇంతకుముందే అనౌన్స్ చేశారు. ఈ ట్రైలర్ లో హాలీవుడ్ హీరోలా కనిపించాడు అఖిల్. ట్రైలర్ కూడా ఆసాంతం హాలీవుడ్ సినిమా చూస్తున్న విధంగా డిజైన్ చేశారు. ఇక అఖిల్ కష్టం అంతా అతని సిక్స్ ప్యాక్ లో కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాగా.. హార్డ్ వర్క్ చేశాడు. అదంతా ట్రైలర్ లో కనిపించింది. ఇక మమ్ముట్టిని ఇలాంటి గెటప్ లో ఎప్పుడూ చూసి ఉండరు. అలా డిఫరెంట్ గా మేకోవర్ చేశాడు దర్శకుడు. యాక్షన్ సీక్వెన్స్ లతో ఏజంట్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఎలా ఉంటుందోచూడాలి. ట్రైలర్ మాత్రం నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ ట్రైల‌ర్ దూసుకుపోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement