Thursday, April 25, 2024

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ: రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. గత ఏడాది వడగళ్లవానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహార చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. గత ఏడాది కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించిందని ఆయన గుర్తు చేశారు. ఆపదలో ఉన్న రైతులను ప్రతిపక్ష నాయకులూ పరామర్శలకే అంకితమయ్యారని మండిపడ్డారు. సహాయం చేయకపోగా ఆపన్నహస్తం అందించే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులను సమయం వచ్చినప్పుడు రైతులు బుద్ది చెప్తారన్నారు. ఇటీవల వడగళ్లవానతో నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. అధికారులు పంట నష్టాల అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు భీమా పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, రైతులకు సమృద్ధిగా సాగునీటిని, 24 గంటల కరెంటును అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆకే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతూ రాష్ట్రంలో ధాన్యం కొలుగోలు చేయడం లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోందని చెప్పారు. దేశంలోని రైతులందరూ కేసీఆర్‌ నాయకత్వం కావాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.గత ప్రభుత్వాలు ఏనాడురైతులను పట్టించుకోలేదని విమర్శించారు.అకాల వర్షాల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు.ఈ రోజు పరకాల మండలం మల్లక్కపేట రైతులకు చెక్కులు అందచేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని,రెండు రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల వారీగా పంట నష్టపోయిన రైతులకు చెక్కులు అందచేస్తామని తెలిపారు.అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ప్రజాప్రతినిధులు,వ్యవసాయ,హార్టికల్చర్ అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఆయా గ్రామాలలో చెక్కులు అందచేయాలని సూచించారు.

పంట నష్ట వివరాలు…
మిర్చి పంట నియోజకవర్గంలో పంట నష్టం 4444 ఎకరాలు, రైతులు 4371 – రూ.2,40,99,254 /-
పరకాల మండలం – రైతులు 1497 – ఎకరాలు 1240 – రూ.66,91,734 /-
నడికూడా మండలం – రైతులు 2042 – ఎకరాలు 2597 – రూ.1,40,25,281 /-
ఆత్మకూర్ మండలం – రైతులు 182 – ఎకరాలు 203 – రూ.10,96,419/-
దామెర మండలం – రైతులు 440 – ఎకరాలు 270.60 – రూ.14,61,240 /-
గీసుగొండ మండలం – రైతులు 44 – ఎకరాలు 13 – రూ.1,76,445/-
సంగెం మండలం – రైతులు 166 – ఎకరాలు 120 – రూ.6,48,135/-

మొక్కజొన్న పంట నియోజకవర్గంలో: పంట నష్టం 1878 ఎకరాలు, రైతులు 1672 – రూ.62,67,814 /-
పరకాల మండలం – రైతులు 44 – ఎకరాలు 56 – రూ.1,85,193 /-
నడికూడా మండలం – రైతులు 136 – ఎకరాలు 175 – రూ.5,83,643 /-
ఆత్మకూర్ మండలం – రైతులు 545 – ఎకరాలు 583 – రూ.18,58,676/-
దామెర మండలం – రైతులు 437 – ఎకరాలు 538 – రూ.17,93,512 /-
గీసుగొండ మండలం – రైతులు 86 – ఎకరాలు 340 – రూ.5,28,985/-
సంగెం మండలం – రైతులు 403 – ఎకరాలు 340 – రూ.11,34,985/-
ఖిలా వరంగల్ – రైతులు 22 – ఎకరాలు 27 – రూ.83,326 /-
ఈ కార్యక్రమంలో మండల & గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement