Friday, May 3, 2024

ఏజెంట్ ఫస్ట్ లుక్ రిలీజ్…సిక్స్ పాక్ లో అఖిల్

అక్కినేని అఖిల్ కెరీర్ లో 5వ చిత్రంగా తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో అఖిల్ సిక్స్ ప్యాక్ తో అదిరిపోయే లుక్ లో కనిపించాడు.

అలాగే ఈ పోస్టర్ తో పాటు మూవీ షూటింగ్ కూడా నేటి నుంచే ప్రారంభం కాబోతోందని ప్రకటించారు. హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. వక్కంతం వంశీ కథ రాయగా…తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement