Friday, May 3, 2024

కిషన్‌రెడ్డిని కలిసిన స్వాత్మానందేంద్ర స్వామీజీ

కేంద్ర పర్యాటక శాఖ కిషన్‌రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళిన స్వామీజీ.. శారదాపీఠంలో జరిగే నవరాత్రి పూజకు రావాల్సిందిగా స్వామి వారు ఆహ్వానించారు. ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన నిర్మాణాలపై పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమనిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని వివరించారు. దీనిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందిచినట్లు తెలుస్తోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement