Tuesday, May 7, 2024

Lokesh Kanagaraj | ఆ సినిమాల త‌రువాతే “లియో 2”.. లోకేష్ క్లారిటీ !

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘లియో’. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దుమ్మురేపింది. ఇక ‘లియో’కు సీక్వెల్ ఉంటుందని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. తాజాగా దర్శకుడు లోకేష్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. లియో 2 కచ్చితంగా వస్తుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం ‘తలైవా 171’, ‘ఖైదీ 2’ సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ‘లియో 2’ మొదలవుతుంది” అని చెప్పారు. ఈ కామెంట్స్ తో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ‘తలైవా 171’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఇక ఏప్రిల్ 2024లో షూటింగ్ మొదలు పెట్టి, దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ‘జైలర్’ తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement