Saturday, May 4, 2024

కరోనా వచ్చిందని సినిమా నుంచి తీసేశారు

కరోనా వైపరీత్యం వల్ల పలువురు నటీనటులు సినిమా అవకాశాలను కోల్పోతున్నారు. తాజాగా ‘బిగ్‌బాస్‌’ షో మొదటి సీజన్‌ కంటెస్టెంట్‌ ఆదర్శ్‌ బాలకృష్ణ కూడా అదే కోవలోకి చేరాడు. కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి కుటుంబం మొత్తం కూడా కోవిడ్‌ బారిన పడింది. దీంతో తల్లిదండ్రులను ఆసుపత్రిలో చేర్పించడంతో పాటు అతడు కూడా చికిత్స పొందాడు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.

ఈ సందర్భంగా తనను ఓ సినిమాలో నుంచి తీసివేశారని బాధపడ్డాడు. తనతో పాటు ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన విషయం సినిమా టీమ్‌కు చెప్పగా.. సినిమా యూనిట్ అండగా నిలబడాల్సింది పోయి తన స్థానంలో ఇంకో నటుడిని తీసుకుందని ఆదర్శ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఒక మాటైనా చెప్పకుండా ఇలా అర్ధాంతరంగా తనను సినిమా నుంచి తొలగించారని అభిమానులతో వాపోయాడు‌. కాగా ఆదర్శ్‌కు జరిగిన అన్యాయానికి అభిమానులు చింతిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement