Tuesday, May 21, 2024

ఇకపై సినిమాలకు స్వస్తి…చంద్రమోహన్

ప్రముఖ నటుడు చంద్రమోహన్ గురించి తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలో నటించిన చంద్ర మోహన్ ప్రస్తుతం ఆరోగ్య రీత్యా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన సినిమాలకు స్వస్తి పలికారు. సోమవారం తో 81వ ఏట అడుగుపెట్టిన చంద్రమోహన్ ఇక సినిమాలకు స్వస్తిపలికారు. 55 ఏళ్ళు నటించానని, రాఖీ సినిమా షూటింగ్ లో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందని, దువ్వాడ జగన్నాధం షూటింగ్ లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డానని అయన గుర్తు చేసుకున్నారు.

వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్, శ్రీమతి శారద ఆకునూరి సంయుక్త ఆధ్వర్యంలో శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ఆధ్వర్యంలో జూమ్లో ఈనెల 22 నుంచి రెండు రోజులపాటు చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 14 దేశాల నుంచి 108 మంది రచయితలు పాల్గొని, చంద్రమోహన్ నటించిన 108 సినిమాల గురించి, వారి నటనా వైదుష్యం గురించి విశ్లేషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement