Tuesday, April 30, 2024

ఆచార్య రిలీజ్ డేట్ వాయిదా – అఫీషియల్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే రెజీనా కసాండ్రా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

ఇదిలా ఉండగా మే 14న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ ను పరిస్థితులు కుదుటపడ్డాక ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ప్రస్తుతం ఫైనల్ షూట్ లో భాగంగా రామ్ చరణ్ సోనూసూద్ మధ్య యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement