Saturday, May 18, 2024

ట‌క్క‌ర్ నుంచి ల‌వ్ సాంగ్ …

హీరో సిద్ధార్థ్‌ ‘టక్కర్‌’ సినిమాతో అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పాషన్‌ స్టూడియోస్‌ తో కలిసి టీ-జీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహా నిర్మాత. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ”పెదవులు వీడి మౌనం… ” అనే పాట విడుదలైంది.” పెదవులు వీడి మౌనం… ” లిరికల్‌ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. నివాస్‌ కె ప్రసన్న స్వరపరిచిన ఈ రొమాంటిక్‌ సాంగ్‌ కట్టిపడేస్తోంది. పెదవులు వీడి మౌనం.. మధువులు కోరే వైనం.. తనువులు చేసే స్నేహం.. నేడే… అంటూ సాగిన పాట ప్రేమ మైకంలో ముంచేసేలా ఉంది. కృష్ణ కాంత్‌ సాహిత్యం అందించారు. కృష్ణ కాంత్‌. దీపక్‌ బ్లూ, చిన్మయి శ్రీపాద ఎంతో అందంగా ఆలపించారు. ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ రైడ్‌ ప్రేక్షకులను ఆకట్టు-కొని ఘన విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమ న్యు సింగ్‌, యోగి బాబు, మునీశ్‌ కాంత్‌, ఆర్జే విజ్ఞేశ్‌ కాంత్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్‌ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా వాంచినాథన్‌ మురుగేశన్‌, ఎడిటర్‌ గా జీఏ గౌతమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ గా ఉదయ కుమార్‌ కె వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement