Monday, April 29, 2024

నీళ్లా భాయి నిమ్మళంగా అడిగే

గాయని సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా పరిచయవుతున్న సినిమా ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్‌. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ”నీళ్లాభాయ్‌…. ” లిరికల్‌ సాంగ్‌ ను విడుదల చేశారు.

శాండిల్య పీసపాటి స్వరపర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్‌ సాహిత్యాన్ని అందించగా సోని కొమండూరి ఆలపించారు. ”నీళ్లా భాయి నిమ్మళంగా అడిగే .ఈ సక్కని సుక్కా లగ్గమెప్పుడని, ఎగిరే గువ్వ, ఎన్నెలోలె నవ్వే..ఆ పప్పు బువ్వ సందడెప్పుడని..” అంటూ పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయి మనసులో కలిగే ఎమోషన్స్‌, కాబోయో భర్త గురించి మొదలయ్యే ఊహలతో ఈ పాట సాగుతుంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటు-న్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement