Tuesday, May 7, 2024

‘అంటే సుంద‌రానికి’ నుంచి లీలా థామ‌స్ ఫస్ట్ లుక్..

ఇంతకుముందు తమిళ సినిమాల్లో కనిపించిన మలయాళ నటి నజ్రియా నజీమ్, మ‌న తెలుగు ఇండస్ట్రీలోని నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కుక్కుతున్న సినిమా ‘అంటే సుందరానికి’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది న‌జ్రియా. కాగా.. ఈ సినిమా నుంచి నజ్రియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయిపోయారు.

సినిమా నుండి నజ్రియా లుక్ విడుదల చేస్తూ, “A photographer sailing in her ocean of Dreams.. Introducing our Electric Charm NazriyaFahadh as Ms.Leela Thomas” అంటూ అధికారిక సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దాంతో పాటు ఈ సినిమాలో ఆమె పాత్రపై హింట్ ఇస్తూ, హీరోయిన్ సిల్హౌట్‌తో కూడిన వినూత్న పోస్టర్‌ను, విడియో విడుదల చేశారు, దీంతో సినిమాలో ఆమె కారెక్ట‌ర్ పై అంచ‌నాలు పెరుగుతున్నాయి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement